: బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికే చంద్రబాబుకు డాక్టరేట్ ఇచ్చింది: ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమెరికాలోని షికాగో స్టేట్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై యూపీఎస్సీ మాజీ సభ్యుడు, ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ వై.వెంకట్రామిరెడ్డి స్పందించారు. గుర్తింపు, ప్రాధాన్యత లేని యూనవర్శిటీలు ప్రముఖులకు డాక్టరేట్లు ఇస్తూ, తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాయని అన్నారు. చంద్రబాబుకు డాక్టరేట్ ఇచ్చిన షికాగో స్టేట్ యూనివర్శిటీకి సరైన గుర్తింపు లేదని చెప్పారు. ఆ యూనివర్శిటీ నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఎవరూ సరైన గుర్తింపు పొందలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News