: గుంటూరు డీపీఓ గోరంట్ల వీరయ్య ఇంటిలో కేజీ బంగారం... పట్టేసిన ఏసీబీ అధికారులు
ఏపీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. గుంటూరు జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న గోరంట్ల వీరయ్య చౌదరి ఇంటిపై నేటి తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడి చేశారు. అలాగే ఆయన బంధువుల ఇళ్లపైనా ఏకకాలంలో మొదలైన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వీరయ్య ఇంటిలో కేజీ బంగారంతో పాటు విదేశీ డాలర్లు పెద్ద ఎత్తున లభించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.1 కోటికి పైగా అక్రమాస్తులను వీరయ్య చౌదరి కూడబెట్టినట్లు ఏసీబీ వర్గాల సమాచారం.