: చైనాపై భారత్ పటిష్ట నిఘా... డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు సమాయత్తం


ఓ వైపు భారత్ తో సన్నిహితంగా ఉంటున్నట్టు వ్యవహరిస్తూనే, మరోవైపు ఇండో-చైనా సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగడం చైనాకే సాధ్యం. అప్పుడప్పుడు భారత భూభాగంలోకి వచ్చేందుకు చైనా సైనికులు యత్నిస్తుంటారు. కవ్వింపు చర్యలకు దిగుతుంటారు. అంతేకాదు, భారత్ ఆర్మీ క్యాంపులపై కూడా దాడి చేసే యత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో, డ్రాగన్ రెండు నాల్కల ధోరణి భారత్ ను ఆలోచనలో పడేసింది. చైనా విషయంలో అలసత్వం ఏమాత్రం పనికిరాదని మోదీ సర్కారు స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో, చైనా అధినాయకత్వంతో స్నేహంగా మెలుగుతూనే, అంతర్జాతీయ సరిహద్దు వద్ద భద్రతను, నిఘాను కట్టుదిట్టం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో, అమెరికా నుంచి అత్యంత నాణ్యమైన డ్రోన్లను కొనేందుకు భారత్ సిద్ధమైంది. ఆయుధ సహిత డ్రోన్లతో పాటు, కేవలం నిఘాకు మాత్రమే వినియోగించే మరో 100 డ్రోన్లను కొనాలని నిర్ణయించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 2 వేల కోట్లు. ఈ డ్రోన్ల సహాయంతో చైనా సరిహద్దు వద్ద నిఘాను పెంచి, వారి నిర్వాకాలను ఎప్పటికప్పుడు పసిగట్టాలనేది భారత్ భావన. అంతేకాదు, చైనా ఆర్మీ ఒప్పందాలను ఉల్లంఘిస్తే, గట్టిగా హెచ్చరికలు జారీ చేయాలని కూడా భావిస్తోంది. ఈ డ్రోన్లతో పాటు ప్రిడేటర్ ఎక్స్ పీ డ్రోన్లను కూడా భారత్ కొనుగోలు చేయనుంది. దేశ అంతర్గత భద్రత కోసం వీటిని వినియోగించనుంది. ఉగ్రవాదుల దాడులను పసిగట్టడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.

  • Loading...

More Telugu News