: ఏలూరు ఎంపీ మాగంటి బాబు గన్ మన్ ఆత్మహత్య... వెల్లడి కాని కారణం!


టీడీపీ సీనియర్ నేత, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (మాగంటి బాబు)కు సుదీర్ఘ కాలంగా గన్ మన్ గా కొనసాగుతున్న ఆదాం (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు ఆర్మ్ డ్ రిజర్వ్ డ్ కానిస్టేబుల్ హోదాలో ఉన్న ఆదాం చాలా ఏళ్లుగా మాగంటి బాబుకు గన్ మన్ గా వ్యవహరిస్తున్నాడు. పార్లమెంటు సమావేశాల కోసం మాగంటి బాబు ఢిల్లీకి వెళ్లగా, ఆదాంకు కాస్తంత సెలవు దొరికింది. ఈ క్రమంలో నిన్న ఆయన ఉన్నట్టుండి పురుగుల మందు తాగేశాడు. దీనిని గమనించిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన చనిపోయాడు. ఆదాం సతీమణి కూడా మహిళా పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News