: జూన్ రెండో వారంలో డీఎస్సీ.. ఏప్రిల్ లో టెట్ : టీ ఉప ముఖ్యమంత్రి కడియం


నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు పదివేల ఉపాధ్యాయ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు. జూన్ రెండో వారంలో డీఎస్సీ నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఏప్రిల్ చివరి వారంలో డీఎస్సీ ప్రకటన విడుదల చేయనుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ చివరి వారంలో డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తామని, జులై రెండో వారంలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఉంటాయని పేర్కొన్నారు. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే టెట్ షెడ్యూల్ విడుదల చేసిన దృష్ట్యా... మార్చి మొదటివారంలో నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ రెండో వారంలో టెట్ నిర్వహిస్తామని మంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News