: హుబ్లీ సమీపంలో పట్టాలు తప్పిన పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ ప్రెస్
పుదుచ్చేరి నుంచి దాదర్ వెళ్తున్న పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ ప్రెస్ రైలు కర్ణాటకలోని హుబ్లీ సమీపానికి వచ్చే సరికి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఇద్దరు ప్రయాణికులు మాత్రం గాయపడ్డారని నైరుతి రైల్వే జీఎం పి.సక్సేనా తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని, సంఘటన గురించి తెలియగానే సహాయక బృందాలను సంఘటనా స్థలికి పంపామని, వీలైనంత త్వరలోనే ఆ మార్గంలో రైలు ప్రయాణం పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.