: కాబూల్ లో సూసైడ్ బాంబర్ ఘాతుకం!
ఆఫ్ఘనిస్తాన్లో ఒక సూసైడ్ బాంబర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. సోమవారం బాగ్రామ్ లోని ఎయిర్ బేస్ వద్ద యూఎస్-ఆఫ్ఘన్ గస్తీ వాహనంపై మోటార్ బైక్ పై వచ్చిన సూసైడ్ బాంబర్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో ఐదుగురు సైనికులు మృతి చెందగా, మరో ఆరుగురు సైనికులు గాయపడ్డారని బాగ్రామ్ గవర్నర్ అబ్దుల్ షుకూర్ ఖుదుసీ పేర్కొన్నారు. ఈ సంఘటనను కాబూల్ లోని నాటో హెడ్ క్వార్టర్స్ కూడా ధ్రువపరిచాయి. కాగా, ఈ సంఘటనపై తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఒక ట్వీట్ చేశారు. ఈ సంఘటనకు తామే బాధ్యులమని, 19 మంది సైనికులు మృతి చెందగా, పలువురు సైనికులు గాయపడ్డారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.