: 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన అసోం స్పీకర్
9 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం అసోం రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 9 మంది ఎమ్మెల్యేలు గత నెలలో బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వీరిపై స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరింది. దీంతో అసోం అసెంబ్లీ స్పీకర్ ప్రణబ్ కుమార్ గొగోయ్ పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 126 మంది సభ్యులు కలిగిన అసోం అసెంబ్లీలో 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా, కాంగ్రెస్ కు 69 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. కాగా, అధికారం నిలబెట్టుకునేందుకు మేజిక్ నెంబర్ 63 కాగా, 69 మంది సభ్యులున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు.