: షిర్డిలో కనిపించిన మల్లాది విష్ణు!


విజయవాడలో కల్తీ మద్యం తాగి పలువురు వ్యక్తులు దుర్మరణం పాలైన ఘటన సంచలనం రేపింది. ఈ వ్యవహారం నేపథ్యంలో అధికార టీడీపీపై విపక్షాలు ముప్పేట దాడి చేశాయి. ప్రభుత్వమే ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు, కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఏ9 ముద్దాయిగా చేర్చారు. కానీ, ఘటన జరిగిన వెంటనే మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో, గత 10 రోజులుగా అతని కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అయితే, మల్లాది విష్ణు షిర్డీలో ఉన్నారని సమాచారం. ఈ మధ్యాహ్నం 2 గంటలకు బాబాను విష్ణు దర్శించుకున్నారని ఏబీఎన్ ఛానెల్ లో కథనం వచ్చింది. షిర్డిలోని తెలుగువారు ఏబీఎన్ కు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారట.

  • Loading...

More Telugu News