: అరుణ్ జైట్లీకి సవాలు విసిరిన బీజేపీ నేత
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి బీజేపీ నేత కీర్తీ ఆజాద్ సవాలు విసిరారు. తనపై పరువునష్టం దావా వేయాలని సూచించారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ)లో అవినీతి జరిగిందని ఆరోపించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అరుణ్ జైట్లీ పది కోట్లకు పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేజ్రీవాల్ పోలీసులకు ఫిర్యాదు చేసి, దర్యాప్తు చేయాలని కోరిన సంగతి తెలిసిందే. దానితో పాటు దీనిపై విచారణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ పై విమర్శలు చేస్తూ జైట్లీ ట్వీట్లు చేశారు. వీటిపై కీర్తీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీడీసీఏలో అవినీతి జరగిందని చెప్పడానికి ఆధారమైన వీడియోను ఆయన విడుదల చేశారు. చేతనైతే తనపై కూడా పరువు నష్టం దావా వేసుకోవాలని సూచించారు. కాగా, ఈ విషయంలో తల దూర్చవద్దని ఢిల్లీ బీజేపీ నేతలకు పార్టీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కీర్తీఆజాద్ వ్యాఖ్యలు చేయడం విశేషం.