: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్ట్... మలేసియాలో హై ఎలర్ట్
మలేసియాలో హై అలెర్ట్ ప్రకటించారు. దేశ రాజధాని జకార్తాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బాంబులతో పట్టుబడడంతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. నూతన సంవత్సర వేడుకల్లో బీభత్సం సృష్టించేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఇందుకు సంబంధించిన బాంబులు, రసాయనాలు, ప్రయోగ పరికరాలను తరలిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను ఇండోనేసియా పోలీసులు జకార్తాలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా నూతన సంవత్సర వేడుకల కుట్ర బట్టబయలైంది. దీంతో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు, దేశ వ్యాప్తంగా నిఘా పెంచారు.