: ఫిఫా మాజీ అధ్యక్షుడు బ్లాటర్ పై సస్పెన్షన్


ఫిఫా (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్) మాజీ అధ్యక్షుడు సెఫ్ బ్లాటర్ పై వేటు పడింది. ఎనిమిది సంవత్సరాల పాటు ఆయన్ను ఫుట్ బాల్ తో సంబంధమున్న అన్ని కార్యకలాపాల నుంచి బహిష్కరిస్తున్నట్టు ఫిపా విచారణ కమిటీ వెల్లడించింది. ఆయనతో పాటు యుఫా చీఫ్ మైఖేల్ ప్లాటినిని కూడా సస్పెండ్ చేసింది. ఫిఫాలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో వారిద్దరూ కొన్ని నెలలుగా విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఆరోపణలు రుజువవడంతో సస్పెండ్ చేస్తున్నట్టు విచారణ కమిటీ పేర్కొంది. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఫిఫాలో భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల క్రమంలో ఇటీవలే బ్లాటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News