: టీఆర్ఎస్ లో చేరిన మరో ముగ్గురు కాంగ్రెస్ నేతలు


తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నేతల చేరిక కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు కేఎం ప్రతాప్, కట్టెల శ్రీనివాస్ యాదవ్, వీఎన్ రెడ్డిలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారి ముగ్గురికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల వారంతా సొంత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్, మైనంపల్లి హనుమంతరావు, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News