: కాల్ మనీ ప్రధాన నిందితుడు సింగపూర్ చెక్కేశాడు... రెడ్ కార్నర్ నోటీసులకు రంగం సిద్ధం


నవ్యాంధ్ర పొలిటికల్ రాజధాని విజయవాడలో వెలుగుచూసి అసెంబ్లీ సమావేశాలను కుదిపేసిన కాల్ మనీ దందాపై ఓ పక్క పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే, ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సత్యానందం సింగపూర్ చెక్కేశారట. ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఎలక్ట్రికల్ డీఈగా విధులు నిర్వర్తిస్తున్న సత్యానందం కాల్ మనీ దందా వెలుగుచూసిన నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. పోలీసులు నమోదు చేసిన కేసులో ఈయన నాలుగో నిందితుడి(ఏ4)గా ఉన్నారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునే క్రమంలో సస్పెండ్ అయిన మరుక్షణమే సత్యానందం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులకు ఇఫ్పటిదాకా ఆయన ఆచూకీ లభించలేదు. మరోవైపు చార్జిషీటులో సత్యానందం పేరు చేరగానే ఆయన పాస్ పోర్టును పోలీసులు సీజ్ చేశారు. అయితే, అప్పటికే సత్యానందం సింగపూర్ పారిపోయారట. దీంతో ఆయనను దేశానికి రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News