: ఒక జంట... ఇద్దరు పిల్లలు!: కొత్త నినాదం వినిపించనున్న చైనా
తగ్గుతున్న కార్మిక శక్తి, పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యతో సతమతమవుతున్న చైనా... ‘ఒక జంట... ఒక సంతానం’ అనే పాత నినాదానికి ఇప్పటికే స్వస్తి పలికింది. ఒక సంతానంతో సరిపెట్టుకోవాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం అవసరం లేదని తన దేశ పౌరులకు చైనా ప్రభుత్వం చెప్పేసింది. తాజాగా ‘ఒక జంట... ఒకే సంతానం’ నినాదాన్ని ‘ఒక జంట... ఇద్దరు పిల్లలు’ అనే కొత్త నినాదంతో రద్దు చేయనుంది. ఈ మేరకు కొత్త నినాదానికి ఆ దేశ చట్టసభ ఇప్పటికే దాదాపుగా ఆమోద ముద్ర వేసింది. కొత్త సంవత్సరాది నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.