: హాలీవుడ్ హీరో ఓర్లాండోకు చుక్కలు చూపిన ఢిల్లీ ఎయిర్ పోర్టు సిబ్బంది!


అతను హాలీవుడ్ హీరో ఓర్లాండో. భారత ప్రభుత్వం తలపెట్టిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చాడు. అయితే, అతనికి సరైన వీసా లేదన్న నెపంతో, ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అధికారులు చుక్కలు చూపారు. దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతించబోమంటూ, తిరిగి లండన్ వెళ్లిపోవాలని కోరారు. తాను ప్రభుత్వం ఆహ్వానంతో వచ్చానని ఓర్లాండో చెప్పినా ఎవరూ వినలేదు. దీంతో ఒక్క రోజు వ్యవధిలో ఓర్లాండో లండన్, ఢిల్లీల మధ్య రెండు సార్లు తిరగాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఓర్లాండోకు ఎదురైన అనుభవానికి చింతిస్తున్నామని చెప్పి, ఆయనకు హుటాహుటిన తాత్కాలిక వీసా మంజూరు చేయాలని ఆదేశించారు. దీంతో లండన్ లో దిగగానే విషయం తెలుసుకున్న ఓర్లాండో తిరిగి ఢిల్లీకి బయలుదేరిన విమానం ఎక్కేసి ఇక్కడ కాలు పెట్టేశాడు. వీసా లేకుంటే, ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ పక్కన బెట్టడం భావ్యం కాదని, భారత పరువును మంటగలిపే ఇటువంటి పనులు తగదని, నెటిజన్లు ఢిల్లీ అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News