: తిరుమలలో స్వల్ప ప్రమాదం... తూర్పు మాడవీధిలో విరిగిన ఇనుప వంతెన
వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలలో భక్తుల తాకిడి అధికం కావడంతో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం శ్రీవారి స్వర్ణ రథోత్సవం ప్రారంభమైన తరువాత, దేవదేవుడిని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు ప్రయత్నించడంతో, తూర్పు మాడ వీధిలోని ఇనుప వంతెన విరిగి ఓ పక్కకు ఒరిగింది. దీంతో దానిపై ఉన్న పలువురు భక్తులు కిందపడగా, ముగ్గురికి గాయాలు అయ్యాయి. తక్షణం స్పందించిన టీటీడీ సిబ్బంది గాయపడిన వారిని తిరుమలలోని అశ్వని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదని, గాయపడిన వారు కోలుకుంటున్నారని టీటీడీ వెల్లడించింది. భక్తులు ఒక్కసారిగా వంతెన పైకి ఎక్కడంతో బరువు పెరిగి ఒరిగిందని పేర్కొంది.