: ఇక బంతి కోర్టు పరిధిలోకి!... రోజా సస్పెన్షన్ పై కోర్టుకు వెళతామన్న జగన్


ఏపీ అసెంబ్లీలో మొన్న అధికార పక్షం తీసుకున్న కీలక నిర్ణయం ఇక కోర్టు పరిధిలోకి వెళ్లనుంది. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చకు అనుమతించాలని ప్రతిపక్ష వైసీపీ సభా సమావేశాలను అడ్డుకుంది. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సస్పెండ్ చేసినా సభ నుంచి బయటకు పోకుండా, దమ్ముంటే మార్షల్స్ ను పిలవాలని సవాల్ చేసిన ఆమె సీఎం నారా చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార పక్షం ప్రతిపాదన మేరకు ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. నేటి సమావేశాల్లో భాగంగా రోజాపై సస్పెన్షన్ ను ఎత్తివేయాల్సిందేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు అధికార పక్షం ససేమిరా అనడంతో వైసీపీ ఏకంగా శీతాకాల సమావేశాలనే బాయ్ కాట్ చేసింది. రోజా సస్పెన్షన్ పై తాము కోర్టుకు వెళ్లనున్నట్లు ఆ తర్వాత జగన్ ప్రకటించారు. దీంతో రోజా సస్పెన్షన్ వ్యవహారం అసెంబ్లీ నుంచి కోర్టు గడప తొక్కనుంది.

  • Loading...

More Telugu News