: రోజాపై సస్పెన్షన్ ఎత్తేయకుంటే సభలో ఉండలేమన్న జగన్... వెనక్కి తగ్గేది లేదన్న యనమల


వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ పై అధికార, విపక్షాల వాడీ వేడీ చర్చ జరిగింది. కొద్దిసేపటి క్రితం మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలుత వైసీపీ అధినేత, సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. తమ పార్టీ సభ్యురాలిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రోజాపై సస్పెన్షన్ ఎత్తేయకుంటే తాము సభలో ఉండలేమని జగన్ పేర్కొన్నారు. దీనిపై అధికార పక్షం పునరాలోచించకుంటే ఈ సమావేశాలను బాయ్ కాట్ చేసేందుకూ వెనుకాడబోమని ఆయన ప్రకటించారు. దీనిపై స్పందించిన సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నిబంధనల మేరకే రోజాపై సస్పెన్షన్ వేటు వేశామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదని కూడా ఆయన తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News