: ‘బాహుబలి-2’లో అవకాశమొస్తే ఆలోచించకుండా ‘ఎస్’ చెబుతాను: సినీ హీరో గోపీచంద్
‘బాహుబలి’ సిరీస్ లో నటించే అవకాశమొస్, ఏమాత్రం ఆలోచించకుండా ఓకే అంటానని ప్రముఖ నటుడు గోపీచంద్ అన్నారు. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘బాహుబలి-2’లో కచ్చితంగా మీకొక క్యారెక్టర్ ఇవ్వమంటూ మీ అభిమానులు డైరెక్టర్ రాజమౌళికి ఒక లేఖ రాశారుట. ఈ విషయం రాజమౌళి చెప్పారు’ అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఈ విషయం తనకు తెలియదని చెప్పారు. ‘ఒకవేళ రాజమౌళి అందుకు అంగీకరిస్తే, మీరు ఓకే చెబుతారా? లేక ఆలోచించి చెబుతానంటారా? అన్న ప్రశ్నకు గోపీచంద్ సమాధానమిస్తూ.. ‘ఇండియాలో ఉన్న బిగ్ ప్రాజెక్టు ఇది. ఆలోచించకుండా.. వెంటనే ‘ఎస్’ చెప్పేస్తాను’ అని 'సౌఖ్యం' హీరో అన్నాడు.