: దోపిడీ దొంగల స్వైర విహారం... బెజవాడలో దంపతుల హత్య
ఈ తెల్లవారుఝామున విజయవాడలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. పటమటలంకలోని ఓ ఇంట్లో దారుణానికి ఒడిగట్టారు. మునగపాటి గంగాధర్ (55), వీరాంజమ్మ (48) దంపతులు నిద్రిస్తున్న వేళ, ఇంట్లోకి జొరబడి వారిని హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలను సేకరించింది. దొంగతనానికి వచ్చిన దుండగులు హత్య చేసి ఉంటారని ప్రాథమికంగా అనుమానిస్తున్నామని, కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇక్కడ లభించిన వేలి ముద్రలను విశ్లేషించి, ఘటన వెనుక పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారా? అన్న విషయాన్ని నిర్ధారిస్తామని పేర్కొన్నారు.