: ఏపీ అసెంబ్లీపై స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ విపక్షాల అల్లరికి మారుపేరుగా నిలిచిందని, ఇది ఎంతో ఆవేదన కలిగిస్తోందని అన్నారు. ఈ ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమస్యలపై చర్చించలేకపోతున్నందుకు ప్రజలు క్షమించాలని కోరుతున్నట్టు చెప్పారు. సభ నిర్వహణ కత్తి మీద సాములా మారిందని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సభను వాయిదా వేస్తూ సాగుతున్నానని కోడెల పేర్కొన్నారు. నిత్యమూ సభను అడ్డుకుంటే, పార్టీలు, ప్రజలకు నష్టమని, అసెంబ్లీ సజావుగా సాగేందుకు అధికార, విపక్షాలు సహకరించాలని కోరుతున్నానని అన్నారు. పైకి చెప్పడానికి కూడా సిగ్గుపడేలా ఉన్న భాషను ఉపయోగించడం, సభా నాయకుడిపైనే నిందలు మోపడంతోనే రోజాపై చర్యలు తీసుకున్నామని, అది కూడా నిబంధనల ప్రకారమే జరిగిందని చెప్పారు.