: గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేయనున్న పవన్ కల్యాణ్!
త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం - బీజేపీలు కలసి పోటీ చేయనుండగా, అభ్యర్థుల తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకోసం 'సర్దార్' చిత్రం షూటింగ్ కు కొద్ది రోజుల పాటు ఆయన విరామం ఇవ్వొచ్చని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. కాగా, తమ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోదని, నిధుల కొరత ఉన్నందునే తామెవరినీ బరిలోకి దించడం లేదని గతంలో పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి అనుకూలంగా పవన్ చేసిన ప్రచారం, తమకెంతో కలిసి వచ్చిందని స్వయంగా దేశం శ్రేణులే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయనకున్న ఇమేజ్ ని మరోసారి క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రెండు పార్టీలకు చెందిన గ్రేటర్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.