: స్మార్ట్ సిటీ ఇస్తామంటే వద్దన్న ఈయనెక్కడి సీఎం?: కేసీఆర్ పై దత్తన్న విసుర్లు


హైదరాబాద్ నగరం మరింతగా అభివృద్ధి చెందాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తనకు అనిపించడం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామంటే, కేసీఆర్ వద్దని చెప్పారని, ఇటువంటి సీఎంను తానెక్కడా చూడలేదని అన్నారు. నగర అభివృద్ధి కోసం, త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమిని గెలిపించాలని దత్తన్న కోరారు. బల్దియా పీఠాన్ని బీజేపీ కూటమి దక్కించుకుంటే, మరింతగా అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను టీఆర్ఎస్ నేతలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News