: తన పెళ్లిని ఆపాలంటూ నేరుగా రంగారెడ్డి కలెక్టరేట్ కు వెళ్లిన బాలిక
తనకు చిన్న వయసులోనే వివాహం చేయాలని నిర్ణయించారని, పెళ్లి చేసుకోకుంటే చెల్లిని, తమ్ముడిని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ, 16 ఏళ్ల బాలిక నేరుగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలిని అశ్రయించింది. మోయినా బాద్ కు చెందిన బాలిక పదవ తరగతి చదువుతుండగా, ఆమెకు పెద్దలు వివాహం నిశ్చయించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎంత మొత్తుకున్నా వినేవారు లేకపోవడంతో, ఆమె జేసీని ఆశ్రయించింది. తనకు చదువుకోవాలన్న కోరిక ఉందని, వివాహాన్ని ఆపించాలని వేడుకుంది. తిరిగి ఇంటికి వెళ్తే, తన తండ్రి చంపేస్తాడని భయపడుతూ, తిరిగి వెళ్లేందుకు ఆ బాలిక ససేమిరా అనడంతో, ఉన్నతాధికారులను పిలిపించిన ఆమ్రపాలి, ఆ బాలికను రెస్క్యూ హోంకు తరలించాలని, పూర్తి వివరాలు వెంటనే అందించాలని ఆదేశించారు.