: బాహుబలి తర్వాత ప్రభాస్ కి నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను!: కథానాయిక సురభి


శర్వానంద్, సురభి జంటగా నటించిన 'ఎక్స్ ప్రెస్ రాజా' ఆడియో వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా కథానాయిక సురభి తెలుగులో కష్టపడి మాట్లాడి అభిమానులను అలరించింది. తనకు తెలుగు పెద్దగా రాదని, తప్పులుంటే మన్నించాలని కోరింది. అనంతరం సినిమా కోసం చాలా కష్టపడ్డామని చెప్పింది. శర్వానంద్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించాడని, అద్భుతంగా నటించాడని చెప్పింది. అంతమంచి కో స్టార్ దొరకడం తన అదృష్టం అని చెప్పింది. అంతటితో ఆగని సురభి, 'తనకు ప్రభాస్ పెద్ద ఫ్యాన్' అని చెప్పింది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. తరువాత యాంకర్ రవి సరిచేయడంతో, నాలిక్కరచుకున్న ఈ ముద్దుగుమ్మ, బాహుబలి చూసిన దగ్గర్నుంచి తాను ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్ అయ్యానని చెప్పింది.

  • Loading...

More Telugu News