: వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు


తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లలో వార్డుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో వరంగల్ కార్పొరేషన్ లోని 58 వార్డులకు, ఖమ్మం కార్పొరేషన్ లో 50 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ రెండు కార్పొరేషన్లలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించారు.

  • Loading...

More Telugu News