: పాపాలు కడుక్కోవడానికే కేసీఆర్ యాగం: మంద కృష్ణ
కేసీఆర్ చేయనున్న చండీయాగం ప్రజల సంక్షేమం కోసం కాదని... ఆయన చేసిన పాపాలను కడుక్కోవడానికే అని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఇప్పటి దాకా ఆయన చేసిన మోసాలు, పాపాలను యాగంతో కడుక్కోవాలనేది కేసీఆర్ ఆలోచన అని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని... ఈ విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ చేస్తున్న యాగంలో ఒక్క దళితుడు కూడా లేడని... అలాంటప్పుడు యాగఫలం ప్రజలందరికీ ఎలా చెందుతుందని ఆయన ప్రశ్నించారు.