: మరో గంటలో కోర్టుకు హాజరుకానున్న సోనియా, రాహుల్


నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు మరో గంటలో ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో వారిద్దరితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా కోర్టుకు హాజరవుతారు. అంటే 3 గంటలకు కోర్టు వాదనలు మొదలవుతాయి. ఇప్పటికే ఆ కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు సమీపంలోని పలు దుకాణాలు మూసివేయించారు. కోర్టు ప్రాంగణంలో మరో 16 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీసుల బలగాలతో పాటు, ప్రత్యేక భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు భారీగా కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో సోనియా, రాహుల్ లు తొలిసారి కోర్టుకు వస్తుండటంతో దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

  • Loading...

More Telugu News