: 10 జన్ పథ్ కు చేరుకున్న రాహుల్ గాంధీ... కేసుపై తల్లి, పార్టీ నేతలతో మంతనాలు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం తన తల్లి సోనియా గాంధీ అధికారిక నివాసం 10 జన్ పథ్ కు వచ్చారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు తన తల్లి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కలిసి ఆయన పాటియాల కోర్టుకు వెళ్లనున్నారు. నేషనల్ హెరాల్డ్ నిధులను దుర్వినియోగం చేశారని వారిపై నమోదైన కేసు విచారణ నిమిత్తం వారు కోర్టుకు వెళ్లనున్నారు. తల్లి ఇంటికి వచ్చిన రాహుల్ కేసు పూర్వాపరాలు, ఈ కేసులో కోర్టు తీసుకోబోయే నిర్ణయం తదితరాలపై ఆయన సోనియా, పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలా? వద్దా? అన్న అంశంపైనా వారు చర్చించుకుంటున్నట్లు సమాచారం.