: రోజా శరీరంపై గోళ్ల గాట్లు... నిమ్స్ కు వెళ్లి పరామర్శించిన జగన్
పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో గాయపడి, స్పృహ కోల్పోయిన వైకాపా ఎమ్మెల్యే రోజాను నిమ్స్ ఆసుపత్రికి తరలించి, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత జగన్ నిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న రోజాను ఆయన పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు... ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరోవైపు, రోజా శరీరంపై గోళ్ల గాట్లు పడ్డాయని... ఆమె వాంతులు చేసుకున్నారని తెలుస్తోంది. బీపీ కూడా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.