: మ్యూజిక్ సిస్టమ్ లో కిలో బంగారం... చెన్నై ఎయిర్ పోర్టులో పట్టివేత


చెన్నై ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న కిలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానంలో కేరళకు చెందిన అష్రాఫ్ అనే ప్రయాణికుడు ఈ ఉదయం చెన్నై విమానాశ్రయంలో దిగాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనుమానంతో అతనిని తనిఖీ చేయగా ప్రయాణికుడి వద్ద ఉన్న మ్యూజిక్ సిస్టమ్ లో బంగారాన్ని దాచి ఉంచినట్టు గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేశారు. తరువాత రూ.25 లక్షల విలువ చేసే కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News