: మనసు మార్చుకున్న సోనియా?... బెయిల్ పిటిషన్ సిద్ధమైందంటున్న పార్టీ వర్గాలు


అరెస్ట్ కు కూడా వెనుకాడకూడదని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మనసు మార్చుకున్నారు. అరెస్ట్ తప్పని పక్షంలో కోర్టును బెయిల్ కోరాలని ఆమె భావిస్తున్నారట. ఈ మేరకు కోర్టులో దాఖలు చేయాల్సిన బెయిల్ పిటిషన్ ను కూడా ఆమె సిద్ధం చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సోనియాతో పాటు ఆమె కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు నేటి మధ్యాహ్నం ఢిల్లీలోని పాటియాల కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న సోనియా, రాహుల్ గాంధీల పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో నేడు వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నలుగురు సీనియర్ నేతలు పాటియాల కోర్టుకు హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ కేసులో అరెస్ట్ తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. నిన్నటిదాకా అరెస్ట్ కు కూడా వెనుకాడకూడదని భావించిన సోనియా గాందీ తాజాగా మనసు మార్చుకున్నారట. కోర్టుకు వెళ్లే సమయంలో వెంట బెయిల్ పిటిషన్లను తీసుకెళ్లి, అక్కడి పరిణామాలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఆమె భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News