: మోడలింగ్ భామలూ... బక్కచిక్కిపోవడం ఇక నేరం!
జీరోసైజ్ కోసం బక్కచిక్కిపోవడం అందంలోకి రాదని, ఆరోగ్యం కూడా ఎంతో అవసరమని.. మోడలింగ్ లో పాల్గొనేవాళ్లు వీటిని దృష్టిలో పెట్టుకోవాలని ఫ్రాన్స్ చట్టాలు పేర్కొన్నాయి. మోడలింగ్ లో పాల్గొనదలచిన అమ్మాయిలు.. ఆరోగ్యకరమైన బరువు తప్పనిసరిగా ఉండాలని.. అందుకు సంబంధించి డాక్టర్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలంటూ ఫ్రాన్స్ కొత్త బిల్లును పాస్ చేసింది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టేవారు తమ శరీరాకృతికి తగ్గ బరువు ఉండాలని సూచించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు శిక్షతో పాటు, జరిమానా కూడా విధించనున్నట్లు సమాచారం.