: బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికి భద్రత పెంపు
బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు పూర్తి భద్రతను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 19న ఈ కేసు కోర్టు ముందుకు రానుంది. ఈ కేసులో విచారణకు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. దీంతో ఆ రోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులకు సంబంధించి కుంభకోణం జరిగిందంటూ స్వామి కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఎలాంటి సాహసానికి పూనుకోకుండా ఆయనకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.