: పోలవరం ఎమ్మెల్యే కారులో మంటలు... కారు దగ్ధం... ఎమ్మెల్యే సేఫ్!
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాదులో శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న ఆయన సభ వాయిదా అనంతరం కారులో వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఆయన వెంటనే కారుదిగేశారు. అనంతరం ఆ కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, తాను క్షేమమని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు.