: శాసనసభలో టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో చదివిన జగన్
అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్షనేత జగన్ మాట్లాడారు. ప్రివిలేజ్ మోషన్ ఇవ్వకుండా బాధ్యతగల ఎమ్మెల్యేను ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం లేదని అన్నారు. అనంతరం ఒక్క ఫోన్ చేస్తే చాలు, వచ్చి ఆడపిల్లలను ఆదుకుంటానని ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన చంద్రబాబు, విజయవాడలో అవసరానికి అప్పుతీసుకున్న మహిళలను వ్యభిచారంలోకి లాగుతుంటే చూస్తూ ఊరుకున్నారని ఆయన మండిపడ్డారు. డ్వాక్రా సంఘాలకు అప్పులు తీర్చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు, అంగన్వాడీ మహిళలను పోలీసులతో కొట్టిస్తున్నారని ఆరోపించారు.