: 'జగన్ కు మెంటలెక్కింది'... గోరంట్ల వ్యాఖ్యలతో మరింత కాక!
విపక్ష నేత వైఎస్ జగన్ కు మెంటలెక్కిందని తెదేపా శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు కాల్ మనీపై చర్చలో మరింత కాకపుట్టించాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ, వైకాపా సభ్యులు పోడియంలోకి మరోసారి దూసుకొచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. గోరంట్ల దూకుడును నియంత్రించాలన్న ఉద్దేశంతో కోడెల ఆ వెంటనే మైకును కట్ చేయాల్సి వచ్చింది. అంతకుముందు గోరంట్ల మాట్లాడుతూ, చంద్రబాబునాయుడిపై హత్యాయత్నం చేయించింది ఆనాటి వైఎస్ అనుచరులేనని, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిందంతా, జగన్ అనుయాయులేనని ఆరోపించారు. పరిటాల రవి హత్య వెనుక ఏ పార్టీ వారున్నారో, ఆ పార్టీ వారంతా ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలిసిందేనని గోరంట్ల వ్యాఖ్యానించారు. జగన్ కు మెంటలెక్కిందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.