: 'సినిమాలు వద్దు లండన్లో చదువుకో' అని చెప్పా: సోనం గురించి షబానా అజ్మీ
'సినిమాల్లో నటిస్తానంటోంది, ఓ సారి మాట్లాడు' అంటూ హీరో అనిల్ కపూర్ తన కుమార్తె సోనమ్ కపూర్ ను తన వద్దకు పంపారని బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ గుర్తుచేసుకున్నారు. 'నీరజ' సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ముంబైలో ఆమె మాట్లాడుతూ, సోనమ్ కపూర్ తనకు కుమార్తెలాంటిదని అన్నారు. అందుకే ఆ రోజు తాను సోనమ్ కి...'ఇప్పుడే సినిమాల్లోకి వద్దని, ముందుగా లండన్ లో చదువు పూర్తి చేసుకుని రా, ఆ తరువాత సినిమాల్లో నటిద్దువు గాని' అని చెప్పానని నాటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. చెప్పినట్టే లండన్ లో చదువు పూర్తి చేసుకుని రాగానే సినిమాల్లో నటిస్తానని వచ్చిందని, అప్పుడు తనకు అండగా ఉంటానని చెప్పానని ఆమె చెప్పింది. కాగా, నీరజ సినిమాలో సోనమ్, షబానా కలిసి నటిస్తుండగా, 2016 ఫిబ్రవరి 19న ఈ సినిమా విడుదల కానుంది.