: నాకు రెండు నిమిషాల సమయం ఇస్తే...అంతు చూస్తా: విష్ణుకుమార్ రాజు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్సార్సీపీ నేతల ఆందోళనతో చిర్రెత్తుకొచ్చిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహంతో ఊగిపోయారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశిస్తూ...ఏం... మీరేమనుకుంటున్నారు? నాకు రెండు నిమిషాల సమయం ఇస్తే ఎవరు ఏంటో తేల్చేస్తానని మండిపడ్డారు. శాసనసభకు వచ్చామన్న ఇంగితం ఉండాలని ఆయన హితవు పలికారు. శాసనసభలో రౌడీయిజం మంచిది కాదని, అధికార పక్షం, విపక్షం మాటలను అంతా వినాలని, ప్రతిదానికీ ఆందోళన అంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ముందు సజావుగా చర్చించాలని, తరువాత అంశాలవారీగా ఆందోళన తెలపాలని ఆయన స్పష్టం చేశారు.