: అసలు ఆమె ఆడదేనా?: రోజాపై చంద్రబాబు నిప్పులు
చిత్తూరుజిల్లా నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. కాల్ మనీ వ్యవహారంపై చంద్రబాబు ప్రకటన చేస్తున్న సందర్భంలో రోజా నినాదాలు చేస్తూ ఆందోళనకు నాయకత్వం వహించారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మహిళా? ఆమె మాట్లాడే మాటల్లో సభ్యత ఉందా? అసలు ఆమె ఆడదేనా? ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా? సంస్కారం లేకుండా ఆమె చేస్తున్న నినాదాలు ఏంటి? అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. సభ్యత సంస్కారం నేర్చుకోవాలని ఆయన సూచించారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు.