: చిన్న వయసులోనే వృద్ధుడైన అభిమానిని కలవాలనుకుంటున్న అమీర్ ఖాన్


బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తనలోని మానవీయ కోణాన్ని మరోసారి బయటపెట్టారు. తనను కలవాలనుకుంటున్న ఓ ప్రత్యేక అభిమానిని స్వయంగా కలవాలనుకుంటున్నారు. ఎప్పుడు, ఎక్కడకు వచ్చి కలవమన్నా అప్పుడు వచ్చి కలుస్తానని ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. అమీర్ కలవాలనుకుంటున్న చిన్నారి ప్రొజేరియా వ్యాధితో ('పా' సినిమాలో అమితాబ్ అలాంటి వ్యాధితో బాధపడే వ్యక్తి పాత్రనే పోషించాడు) బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి గురైన వారు చిన్న వయసులోనే వృద్ధాప్యం బారిన పడతారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే ఫేస్ బుక్ పేజ్ లో సదరు అభిమాని గురించి రాశారు. అమీర్ నటించిన 'తారే జమీన్ పర్' సినిమా తనకెంతో నచ్చిందని ఆ చిన్నారి తెలిపాడు. అమీర్ ను కలవాలనే ఆశను కూడా వెలిబుచ్చాడు. దీంతో, అమీర్ ఖాన్ స్పందించాడు. కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని... పూర్తి వివరాలు ఇస్తే, స్వయంగా వచ్చి కలుస్తానని చెప్పాడు.

  • Loading...

More Telugu News