: అంబేద్కర్ ను చంద్రబాబు తెరమీదకు తేవడానికి కారణమిదే!: జగన్


శాసనసభ ఎజెండాలో అంబేద్కర్ ప్రస్తావనే లేదని... కేవలం కాల్ మనీ, సెక్స్ రాకెట్ పై చర్చ జరగకుండా అడ్డుకోవడానికే అంబేద్కర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తెరమీదకు తీసుకువచ్చారని వైకాపా అధినేత జగన్ మండిపడ్డారు. ఈ రోజు తనతోపాటు తమ పార్టీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో వైకాపా సభ్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, కాల్ మనీ, సెక్స్ రాకెట్ పై చర్చిస్తే చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న నేతల పేర్లు బయటకు వస్తాయనే భయంతోనే ఆ అంశంపై చర్చించడం లేదని ఆరోపించారు. నిన్న తాము వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో అంబేద్కర్ అంశం చర్చకే రాలేదని... ఆ తర్వాత ఓ వ్యూహం ప్రకారం అంబేద్కర్ ను ముందుకు తెచ్చారని విమర్శించారు.

  • Loading...

More Telugu News