: పేదల కష్టాలు తెలిసిన గొప్ప నాయకుడు కేసీఆర్: మంత్రి పద్మారావు
ఇచ్చిన హామీలన్నింటినీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని టీఎస్ మంత్రి పద్మారావు తెలిపారు. పేదల మనసు తెలిసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. హైదరాబాదులోని అడ్డగుట్టలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ, అడ్డగుట్టలో 200 డబుల్ బెడ్ రూమ్ లను నిర్మిస్తున్నామని చెప్పారు. పేదల ఇళ్ల కల సాకారం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, మంత్రులు నాయిని, కేటీఆర్, తలసాని తదితరులు హాజరయ్యారు.