: విజయవాడలో సీఎం కార్యాలయ ముట్టడికి అంగన్ వాడీల విఫలయత్నం


సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్ వాడీ టీచర్లు చేపట్టిన సీఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమం విఫలమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్ వాడీ కార్యకర్తలు విజయవాడలోని బందర్ రోడ్డు ప్రాంతం నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వైపు వెళ్లబోతుండగా మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికక్కడే అనేకమందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలని కొంతమంది కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేస్తుండగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 5 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, పెంచామని చెప్పిన జీతాలు కూడా ఇంతవరకు అమలు కాలేదని అన్నారు. వెంటనే తమ డిమాండ్లు తీర్చాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News