: పాక్ ప్రభుత్వం కదలకుంటే నష్టం ఇండియాకే!: అమెరికా


తమ దేశంలో ఉగ్రమూలాలను సమూలంగా నాశనం చేసే దిశగా పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుంటే, తొలి నష్టం ఇండియాకు జరుగుతుందని, ఆపై ఉగ్ర ప్రభావం ఆఫ్గనిస్థాన్ పై పడుతుందని అమెరికా హెచ్చరించింది. పాకిస్థాన్ సర్కారు తెహ్రీక్ ఈ తాలిబాన్ ఉగ్రవాదుల అంతం చూడాలని భావిస్తోందే తప్ప, స్వదేశంలోని ఉగ్ర సంస్థలపై దృష్టిని సారించడం లేదని యూఎస్ ప్రతినిధి రిచర్డ్ జీ ఓల్సన్ సెనెట్ విదేశీ వ్యవహారాల కమిటీకి తెలియజేశారు. దీని కారణంగా పాక్ పొరుగు దేశాల్లో ఉగ్ర దాడులకు అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. తక్షణం పాక్ ఉగ్ర సంస్థలను అడ్డుకుని వాటిని పూర్తి క్రియారహితం చేయాల్సి వుందని అన్నారు.

  • Loading...

More Telugu News