: వైసీపీ ఎమ్మెల్యేలను బయటకు ఎత్తుకెళ్లిన మార్షల్స్


వైసీపీ సభ్యుల మూకుమ్మడి సస్పెన్షన్ తో ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంబేద్కర్ పై చర్చను అడ్డుకున్న కారణంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా సభలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలనందరినీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సస్పెండ్ చేశారు. అంబేద్కర్ పై చర్చ ముగిసేవరకే ఈ సస్పెన్షన్ వర్తించనున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తమ సస్పెన్షన్ పై ప్రభుత్వ ప్రతిపాదన, స్పీకర్ ఆమోదంపై నిరసన తెలిపిన వైసీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లేందుకు ససేమిరా అన్నారు. ఇదే సమయంలో స్పీకర్ స్థానం నుంచి కోడెల నిష్క్రమించగా, బీకే పార్థసారధి సభాధ్యక్ష స్థానాన్ని అలంకరించారు. సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లాలని ఆయన పదే పదే చేసిన విజ్ఞప్తిని వైసీపీ ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టారు. దీంతో పార్ధసారధి మార్షల్స్ ను రంగంలోకి దింపారు. స్పీకర్ ఆదేశాలతో రంగప్రవేశం చేసిన మార్షల్స్ వైసీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు ఎత్తుకుని తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News