: పవన్ కల్యాణ్ ను తరిమికొట్టాలన్న రచయితకు పోలీసు రక్షణ


టాలీవుడ్ హీరో, జనసేనాని పవన్ కల్యాణ్ ను తరిమికొట్టాలని అంటూ 'పవన్ కల్యాణ్ హటావో... పాలిటిక్స్ బచావో' పుస్తకాన్ని రాసిన బొగ్గుల శ్రీనివాస్ కు పోలీసు భద్రత కల్పించాలని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, హైదరాబాదు నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. నేటి నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో తన పుస్తకాన్ని అమ్మకానికి ఉంచానని, పవన్, ఆయన అభిమానుల నుంచి ముప్పు ఉన్నందున భద్రత కల్పించాలని శ్రీనివాస్ కోరారు. ఇదే విషయమై హోం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించగా, రక్షణ కల్పించాలని నాయిని ఆదేశించారు. కాగా, ఈ పుస్తకంపై గతంలోనూ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News