: శేషాచలం కొండల్లో వందల మంది ‘ఎర్ర’కూలీలు... పోలీసులపై రాళ్లతో దాడి, పరారీ


నిత్యం బూట్ల చప్పుళ్లు, వెంటాడుతున్న నిఘా కళ్లు, పొంచి ఉన్న తుపాకీ తూటాలు, ప్రాణాలు తీసే ఎన్ కౌంటర్లు... ఇవేవీ ఎర్రచందనం దొంగలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా దాడులు చేస్తున్నా ‘ఎర్ర’ దొంగలు భయపడటం లేదు. మునుపటిలాగే వందలాది మంది శేషాచలం అడవుల్లోకి వచ్చేస్తున్నారు. విలువైన, అరుదైన ఎర్రచందనం వృక్షాలను అడ్డంగా నరికేసి దుంగలను ఎత్తుకెళుతున్నారు. నిన్న రాత్రి చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని జూపార్క్ కు కూతవేటు దూరంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు వంద మందికి పైగా ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. అరెస్ట్ చేసేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లు రువ్విన కూలీలు వెంట తీసుకెళుతున్న దుంగలను వదిలి పరారయ్యారు. దొంగలు వదిలిన దుంగల విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దొంగల దాడి నుంచి తప్పించుకున్న పోలీసులు వారు వదిలిన దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News