: జనవరి 8 నుంచి 'ఔత్సాహిక' సదస్సు... తెలుగు విద్యార్థులకు స్వాగతం పలికిన ఖరగ్ పూర్ ఐఐటీ
జనవరి 8 నుంచి మూడు రోజుల పాటు ఖరగ్ పూర్ లోని ఐఐటీలో వార్షిక గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ (జీఈఎస్) జరగనుంది. ఖరగ్ పూర్ విద్యార్థుల ఈ-సెల్ (ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెల్) ఆధ్వర్యంలో ఈ సదస్సుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. పలువురు ప్రముఖులు సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారని, విద్యార్థుల సందేహాలను తీరుస్తారని, ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు వర్క్ షాప్ లను ఏర్పాటు చేయనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇండియాలో ఔత్సాహిక విద్యార్థుల స్థాయిలో జరిగే ఉత్తమ సదస్సుగా జీఈఎస్ ఇప్పటికే పేరును తెచ్చుకున్న నేపథ్యంలో ఈ దఫా కూడా సదస్సు విజయవంతమవుతుందని భావిస్తున్నట్టు వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి విద్యార్థులను, ప్రొఫెసర్లను సదస్సుకు ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలియజేశారు.